ఇచ్చంత్రాల నవ్వు...



సంధ్య వేళ భానుడి పోలు
వగల రంగు వలువగ మార్చి
తెల్లని ఆ మేఘాలే నీ మదిని దాచు
పై యదను కాచు కోంగుగా ముడిచి
నవ నవల సుమ విరులే గంధాలుగా పూసుకుని

మేలి ముత్యాల పచ్చడాలె చెవుల చేయు భోగాలు
నీ కాలు కదిలి జల్లుమని జుమ్మని మ్రోగే మంజిరాలు
పరువాల గాలి చల్లగ విచెనో
నీ నడువొంపు తకదిమి ఆడేనో
నీ గాజుల గల గల పిలిచెనో

నయనాలు ఆడే దోబూచులాటకు
తమలపాకుల పరుపు చూడు
మన తను వేడికి పాలిపోవు
కరి బిగియుల నలిగిపోవు

పడతి నిను చూసి ఇచ్చత్రం అనే జనులు
వడి కాకులు కాదా సుమి
నీ గోటికి వారు సరిరారు కదమ్మి..

...................................+++

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...