ఎవరీ అభాగ్యురాలు

ఎవరమ్మా నీవు
ఏ వంశానికి మూలాధారం నీవు
ఏ ఇంటి ఆడపడుచు నీవు
అయిన వారి ఇంట పుట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నా

ఆరుపదుల వయసులో
మొగ్గు బుట్టలా నెరిసిన జుత్తుతో
బోసి పోయిన ధీనమైన మోముతో
యాచన చేస్తున్న నీవు ఏవరమ్మా ..?

ఐదుగురు కొడుకులను కన్నా
విధురుని అశ్రమాన తలదాచుకున్న కుంతివా
నూటొక్క సంతానం కలిగినా ఆఖరి ఘడియలలో ఏ పుత్రుడు తోడు లేని గాంధారివా
ఎవరు నీవు ఏ ఇంటిలో కొడిగట్టిన దీపం నీవు

చేయి ఆకాశాన్ని అర్థిస్తున్నా
అరికాళ్ళ కింద భానుడు కరుపెక్కిస్తున్నా
ఆకలి భాధ మెదడు నాడులను నులిమెస్తున్నా
ఎందుకమ్మా తొమ్మిది దారుల దేహంపై మక్కువ

సురా ముపై మూడు కోట్ల దేవతలున్న దేశంలో
ఏ దేవుడు నిలపడడేమమ్మా నీ పక్కన
క్షేమాపణలు కోరుతున్నా తల్లి ఈ దేశం తరుపున
..............….........................+++🪄
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...