ఎప్పుడత్తవు నీ జిమ్మడి పోను..🦅








అర్థరాత్రి దాటినా

ఆకలి అంతా అలిగి చచ్చినా
కమ్మని కల వచ్చి మురిపిస్తున్నా
నిదుర రాక నిట్టూరుస్తున్నా

గడియ కూడ కదలదు
కనుల మత్తు మచ్చుకైనా రాదు
జగత్తు మత్తున తూలుతున్నా
నా జగత్తు నువ్వవ్వడం వల్లనా ఏమీ..?

నా భాధ నానాటికి పెరుగుతున్నది
నీవు దూరం ఐతే బతకలేనంటుంది
నీ కోసం బ్రతుకు చాలించమంటుంది
నీ ఉచ్చ్వాస నిచ్చ్వాసగా నిలిచిపొమ్మంటున్నది..

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...