గురువు చేతి బెత్తం






నిశికమ్మిన వీధి చివర వెలిగిన ఓ లాంతరులా 

ప్రచండమౌ సముద్రాన్ని జయించిన నావికుడిలా

కరువు నేల పులకించగ కురిసిన ఆ చినుకులా

అజ్ఞానం కరిగించి విజ్ఞానపు దారి చూపినా..?


పూలమ్మిన నేల మీదే కట్టెలమ్మే దాపరికం

దైవమనే స్తుతిని మరిచి చులకనగా చూస్తున్నాం

గురువులపై భక్తి విడిచి భుజం రాసి వెళ్తున్నాం

భయం లేదు భక్తి లేదు గౌరవంగ వాక్కు లేదు 


అయ్యా..! అను పదం వదిలి ఏమయ్యా అంటున్నాం


పసిడైనా కంసాలి కొలిమి చేరి మెరుస్తుంది

పాశానమైన శిల్పి చెంత శిల్పమై నిలుస్తుంది 

విద్యార్థికి గురువు తోడు జీవితమే గెలుస్తుంది

గురువు చేతి బెత్తమే భవిషత్తు రాస్తుంది

తన నోట రాలు అక్షరాలే సిరుల పంటనిస్తుంది🪄

----------------------------------------++++++++++

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ

తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులకు ఇచ్చారు మన పెద్దలు వారందరికీ నా నమస్కారములు అలా నా విద్యార్థి జీవితంలో పాఠాలు, జీవితం లో గుణపాఠాలు చెప్పిన గురువులను స్మరిస్తూ వారికి ఈ కవిత అంకితం చేస్తున్నాను

రచన : తాజ్ 

పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...