నీవు నా పక్కనుంటే...!


ఇది కవిత కాదు, కల్పన అంతకన్నా కాదు
ఇది కథ కాదు, కథానికా కాదు
బుద్ది చాటు మాట కాదు, మనసున మెదిలే పాట కాదు
ఎన్ని రోజులయ్యింది, ఎంత నిరీక్షణ సాగింది
నా గొంతు మూగబోయింది, నా కలం పట్టు తప్పింది
ఎదురు చూపులో వదురు మాటలు
ఎదురు పడినను చేటు చూపులు
అంతరం పెరిగింది, భంధమే విరిగింది
గమ్యానికి ముందుగానే గిరుల తలుపు మూసింది
కాలం అను నావ లోన కన్నీరే మిగిలింది
మనం అనే తెడ్డు విరిగి విడ్డూరం చూస్తుంది
నీ తోడు లేక నడవలేక అడుగు దారి పట్టింది
వనాలన్ని చేత మొలిచి చెంపవాయ కొడుతుంది
గోదారి గంగ కనుల నిండి ఊపిరాడనియకుంది
ప్రాణ ప్రియా మన్నించు, నీ గొప్ప మనసు పలికించి
నీ తోడే చాలు నాకు, అదే గొప్ప గెలుపు నాకు
నా చేతిలోనే నీ చేయి చాలు, ఏ దిగులు లేదు నాకు
మన ప్రేమ నిజం అయ్యేనా, అది నిన్ను నన్ను పెనవేసెనా
జగాలన్ని జయహో అని, నా కాళ్ళ ముందు వంగి వణుకు
యడబాటుకు వీడుకోలు, మన్నించవా నా వేడుకోలు..
................................................................................++++
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...