నీ నవ్వే నాకు జాబిలి వెలుగు..!













నర్మగర్భ లలితమగు నా చెలి
నీ విజ్ఞానం ముందు సాటి కాదు ఏది
నీ మనసు కడలి, దాని నిండుగా జాలి
నీ మోములో హాస్యం, తను ఒంపులో రహస్యం

నీకు నీవే సాటి , నీ ముందు లోకం ఏపాటి
నీవు అందరికంటే ఘనాపాటి
ఈ పుడమికి చినుకు వరం
నీవు తోడుంటెనే నా జీవితం మధురం

నీ నవ్వే నాకు జాబిలి వెలుగు
నీవు చెంతనుంటే బాధలు తోలగు
నా జీవితంలో చింతలు చెరగు
కొత్త పోకడలు తొడుగు

నిన్ను చూసిన చాలు ఒక్క క్షణం
మదిలో దాచుకుంటా కలకాలం..!

రచన : తాజ్ 
మీ పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...