వంక నడుము చిన్నది..




అమాయకపు చూపులతో, అతి వినయపు మాటలతో
ఆనందాలు అందిస్తూ, చిరు నవ్వులు చిందిస్తూ
నీవు వస్తావనే ఆశ ఏదో, నను చిలిపిగ కవ్విస్తూ
ఆకాశపు దరి అందకున్న, వాన చినుకు చేరినట్లు
సంద్రపు లోతెరుగకున్న, అలల హొయల తేలినట్టు
ఉల్లాసం పంచిస్తూ, నవ్వులతో ఊరిస్తూ
వంక నడుము కెంపులతో, ఒంపులిరగ సొంపులతో
అల్లరిగా అల్లుకుని, మల్లియలలో హత్తుకుని
సుగంధాల పువ్వువో, సుమనోహర తావివో
అందం నీ సొంతమైతే, నీవే నా ఇంట పడితే
అదియెలే ఆనందం, నా ఇల్లే బృందావనం
...................................................🪄

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...