మా నాన్న మాట..








మిత్రమా..
నీకో విషయం చెప్తాను గుర్తు ఉంచుకో
ఇది మా నాన్న నాతో అన్నది నేను నీతో అనేది

"సంక జోలె చినిగిపోలే, ముందు ఊళ్లు కాలిపోలే"

ఈ ఊరు కాక పోతే ఇంకో ఊరు
అది కాక పోతే ఆ పై ఊరు ఎలాగైనా బతకొచ్చు

కానీ ఇదే జీవితం ఇదే బతుకు అని
జీతానికి నీ జీవితం ఇవ్వద్దు

బాధ భయం రెండు వద్దు
రెక్కలు దాయనంత కాలం
ఎన్ని కుక్కలు మోరిగినా
నీ ఆస్తులు కరిగిపోవు

రచన : తాజ్
పల్లెటూరీ పిల్లోడు...

లవ్ యు నాన్న 😍🙏🏻


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...