నా సొంతమై నిలువు నా కంటి ముందే








దొంతిలా మారి ఒక్కో మాసం
నీ జ్ఞాపకాలు నాతో శకం
ఆడిన ఆటలు చెప్పిన మాటలు
చేసిన బాసలు చూసిన గాదలు

అంతు తెలియని ఆనందాలు
కొంతెనా అను నిమిషాలు
అందంగా అల్లిన చేతులు
ఇష్టంగా మన మల్లిన జతులు
రాతలు గితాసుపు కవితలు

నేతుల మూటై కడవల ఊటై
తేనెలు జారే నీ నోటిన పాటై
స్వరాల వనాల హరపు తొటై
నీ పాదము చేరెను సాగే బాటై

నా కవితలా బతుకు మారాలని
నీ కంటిలో నవ్వు చూడాలని
నీ ఇంటిలో సిరులు నడవాలని
ఆయురారోగ్యాలు అందాలని

ఒక్కొక్క రోజు మక్కువగ మారి
పాలపుంత కాంతి నీ కనులలో దూరి
తారలింట వెలుగు జాబిల్లి మల్లే
నా సొంతమయి నిలువు నా కంటి ముందే..!

రచన : తాజ్
పల్లెటూరీ పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...