అలిగిన ప్రేయసి... అల్లాడే ప్రేమికుడు









గగనతలంపై ఎగురు కపోతమా

గిరి చివర చేరి నాట్యమాడు విహంగమా

విన్నపంగా నా చెలికి వివరించు నా మదితలపు

ఆ కన్నులలో ఊరేగే మెరుపు చూసి బ్రమపడకు

తన ముందు చేరి భయపడకు, వెన్ను చూపి పారిపొకు

తన స్వరం నీవు వింటే చాలు, తన చెలిమి నీకు ఎంతో మేలు

మచ్చికగా నీవు మెదులు, అదును చూసి నా బాధను తెలుపు

నా నాడి తెలిసిన నాయకురాలిగా, బాధ్యతేరిగిన రాయబారిగా

ఒక్కొక్కటి ఏకరువు పెట్టు, అంతకుముందు ఓ సలాం కొట్టు

ఒక్కసారి తన గుండెను తట్టు, మా జ్ఞాపకాలు మెదిలేటట్టు

కొట్టినా, తిట్టినా, పెట్టినా, మొట్టినా ఆరోజులు మరిచావెట్లని

దీనంగా మొహాన్ని పెట్టు, తన కాళ్లపై నీ తలనే పెట్టు

చిరునవ్వుకై దోసిలి పట్టు, తానే నా ఆయువు పట్టు

మమ్ము ఒక్కటి చేసి పుణ్యం పట్టు, నీ రెక్కల దాచి నా ముందర పెట్టు
............................................🪄
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...