పల్లెటూరి ప్రేమ కావ్యం..








పల్లెటూరి పడుచుదనం
యెంకి లోని పెంకితనం
కనులురాలు చిలిపితనం
కరుణ కిరణ సాయగుణం

గొంతు పలుకు తీపి స్వరం
నా చెవుల మ్రోగు నాదస్వరం
వన్నెలోలుకు మణిహారం
హొయలు కులుకు సుమబాణం

అందానికి ఆవిర్భావం నువ్వు
నీకు సాటి ఎవరు, అది నువ్వు
ఆత్మీయతలు అంకురించిన నీ నవ్వు

అందమా..! నా అనురాగ దిపమా
ఆలింగనాల అదర చుంబనాలు
కవ్వింతలు వలపు కేరింతలు
కలబడుతు క్రిడించగా

సాగిపోయే కాలమైన
ఒక్క క్షణం నిలిచి చూడ
ఆకాశం, భూలోకం
అచలనమై పరికి చూడ

నా జతగా చేరుమా, నీ చేత నన్ను తడువుమా
నా పెదవులపై ఆటలాడ నీ పెదవుల పంపవా
నా హృదయంపై తలవాల్చి ఒక్కమాట చెప్పవా
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని..!
-----------------------------------------------🪄
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...