తెలుగు తల్లికి వందనం








తెలుగు తల్లి నీకు వందనం..
తెలుగు లిపికి నేను పాదాక్రాంతం ....✍️

ఏమిటయ్యా ఈ నిరాశ నిస్సహయత
నిజానికి నీడ లెనట్టు నీతికి జాడ కరువైనట్టు
ఆకాశపు నీటదార అలిగి దిగిరానట్టు
నా గొంది లొని బావాలు గురి తప్పినవా అన్నట్టు

బుద్ది మనసు ఒక్కటవగ నీకు దిక్కెవరు అన్నట్టు
నా కలం విదిల్చి రాల్చ అక్షరాలె కరువైనట్టు
శూన్యం లొ దూరి పొయి దారి మరిచి పొయినట్టు
అంతా అయొమయం నాలొని కవికి పొయె కాలం..

అంతటా అమావాస్య  ద్యయం
కారు చీకంట్లొ నాతొ నాకె రణం

ఝరులా సాగె నా జన పదులు జీవంకొల్పొయాయ
జనావళిని జనరంజకం చెయు జీతాసులు
కలం మాటుజారలెక జొగుతున్నాయా
నీరసించి నిద్రలొనె తూగుతున్నాయా 

జంజామారుతమైన జన చైతన్య పంక్తులు
కావాతు మరిచి కాలిపొయాయా..

కవితె లొకంగా జీవించాను
బావవ్యక్తికరణకు కలమె నా ఆయుదమని గర్వించాను
కలం ముందు కానిదెదని బ్రమించాను
అంతటి నా ప్రతిభా శైలి ఎమయినది
కనుల పడునదెది మనసును ద్రవించలెక పొతున్నది

తెలుగు తల్లి నీకు వందనం,నన్ను కటాక్షించు
కవితా కుసుమాలు నా మనసున విరసించు
నాలొని బావాలు అక్షర మార్గమై
కవితాక్షర మాలికల తో నిను అర్చించె ఆజ్ఞ ఇవ్వు

తెలుగు లిపికి వందనం...
నాలొని కవిని సత్కరింపమని ఆవ్వానం...

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...