పెళ్ళానికి ప్రేమలేఖ








తొలకరి చినుకుల మాసంలో
తొలి వేకువ పొద్దున కోయిలవై
కమ్మని స్వరాల మాలికవై
మది రాజ్యము లాగు ఎలికవై

వేసవి రేపే దూపలలో
గొడుగును పరచు తామరవై
సన్నగ విచే పవనమువై
గొంతున జారు సితలమై

శీతాకాల సంధ్యలలో
సెదతిర్చేటి తూలికవై
వణుకు మాన్పెటి కౌగిలివై
సరుకు తగిలించు కుంపటివై

కరిగే కాలం, తిరిగే భూమి
పగలు, రాతిరి బేధము లేమి
నమ్మిన చేయి అందిన నాడు
నాది నిదను వాదన మాని
ఒంటిగ కాదు జంటగ ఉందాం

మనిషిగ మారి మంచిని కోరి
అర్ధిస్తున్నా నీ కోసం
అందిస్తావా నీ మది సౌధం
చివరి ఆశగా వస్తున్నా
చిరకాల వాంచ గా చెప్తున్నా
నిన్ను ప్రేమిస్తున్నానని..!
---------------------------------🪄

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...