నీ నవ్వులే - మెరుగులు..














ఈ వెలుగులు తిమిరం తరిమి
నా నిదురను పరదా తొలగి
ఓ ఆశల వలనే విసిరి
నిను నా తలపులలో బందీ చేసి

కడలి అల నేనైతే
సాగు నావ నివైతే
ఉయాలై ఊపనా
జాలిగా తడపన

ముందు అల నీ ముంగురు తాకగా
నే నీ వెనుక చేరి కనులను మూసిన
ఉవ్వెత్తున ఎగసి రాన
నిను హాత్తుకు ఒడ్డున నిలవన

ఆ పిదప..?
ముత్యాలు పగడములన్ని
నే కానుక అందిస్తుంటే
చిన్నబోయే ముత్యాలన్ని
తళుకు మానే రత్నాలన్ని

వెరసినవి కళ మాసినవి
మరలా అవి మెరవాలంటే
పసిడి పాత్రలా నీ నవ్వు కావాలట
అది తోడై పాలపుంతలా  
నీ మెడలో హారాలవుతాయట..
మరి నవ్వు..!
.....................................++++

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...