జోహార్ నాయిక 🧚‍♀️








ఇది విధి వణికించిన జీవితం
ఆ విధాత వంచించిన క్షణం
రచయిత అచ్చు తప్పులు
గాయని తప్పిన శ్రుతులు
శ్రోతల చెవులు తూట్లు పొడిచినట్లు

అసంపూర్ణమైన ఆలోచనలు
ఆలోచనే లేని అడుగులు
అల్లుకుంటున్న వెతలు
హృదయాన్ని జల్లెడ చేస్తుంది

గమ్యం నిర్ధారించలేని ప్రయాణాలు
గాటు రోడ్లపై సమీపమని వెళ్తే
షాక్ తగిలి కూలబడిన రోజులు

ఒక తల్లి మోసిన పాశం మరువదు
తన బిడ్డను రోడ్డున విడువదు
ఏ జీవి స్వార్థం కోరదు
తన బిడ్డల యడబాటు కూరదు

సప్త ప్రమాణాలు చేసి
శాస్త్రనుగుణంగా నడవాలని సర్వం అనుకునే
ప్రేయసి వదులుకుంటుంది
కాదు వదిలించుకుంటుంది

గట్టు తెగిన ప్రవాహం లంగరు లేని పడవ
ఏ గూటికి చేరునో ఏ ఆశలు కూల్చునో
ఏ రాహువు కన్నుపడి, మా అనురాగం కుంటుపడి
ఓ పంతం అంతం కోరి, నా ప్రేమను ఉరి వేసింది

అయోమయమై అంతా బ్రమయై
అస్తవ్యస్తపు అలజడి బ్రతుకై
జోహార్ నాయిక
నా వెనుక నీ జ్ఞాపకాలే ఇక..🧝🏻‍♀️
.....................................🪄
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...