సదా నీ సేవలో (కిక్ ఇచ్చే కాఫీ)🍵













నల్లని ఆ కైనీడ తొలగిందో ఎమో
నీ మోముపై పరదా జరిగిందో ఎమో
నీ నవ్వు పూసుకుని ఈ లోకం వెలిగిందో ఎమో
పంచ భూతాల సమ్మెలిత దేవతవే నీవో
నీ నవ్వు లేని నాడు ఈ జగతి ఎమవునో ఎమో
అందకారమగు చీకట్లలో మగ్గుతుందో ఎమో
సూర్య చంద్రులే నీ దేహంపై విలసిల్లిరేమో
నీ ఇరుకన్నులై వారిరువురు బాసిల్లినారేమో
గోదారి అలల లాగ కలలు విరియు చందంగా
నీ నడకకు లోకమంతా దోసిలిడినారేమో
నీ పాదం తాకి జన్మ ధన్యత అని
సంద్రాన పాశనులై పడున్నారో ఎమో
దయించవా తన్ని తరింప జేయవా
ఈ పుణ్యకార్యం చేసినంతనే
మాజన్మ ధన్య ప్రధానమే
నీకు బానిసా గణమై
కాఫీ ఇత్యాది ఫలహారాలు అందించి
అది నీవు గ్రొలుతుండ అధరములపై
అద్దిన పాల మీగడ మత్తుగోలపగ
నీ ఇంటి ముందు నీ కంటి ఆజ్ఞకై
వేచు భక్తులమై నీ సేవ చేయుచుందుము...
....................................................................
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...