అమాయక చక్రవర్తి (కథ)



అనగనగా మహాబలేశ్వరం అనే గ్రామంలో సోమయ్య అనే ఒక మోతుబరి ఉండేవాడు అతనికి రాము అనే అమాయకమైన కుమారుడు ఉండేవాడు చలమయ్య గ్రామంలోని వారికి అప్పులు ఇస్తూ వారి దగ్గర నుండి అస్తి పత్రాలు తనఖా గా తీసుకునే వాడు తండ్రి ఇచ్చిన అప్పు పత్రాలను తనకు తెలియకుండా చింపేసేవాడు రాము ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది దానివలన గ్రామంలో అప్పు ఎవరికి ఎంత ఇచ్చింది ఎంత వసూలు అయ్యింది అన్న విషయం కూడా తెలియకుండా పోయింది దానితో కోపోద్రిక్తుడైన చలమయ్య ఒకరోజు తన కొడుకును మందలించాడు అంతటితో ఆగకుండా అతన్ని తన్ని ఇంట్లో నుంచి తరిమేశాడు

అలా అమాయకుడైన రాము హూ హూ అని ఏడుస్తూ ఇంట్లో నుంచి బయలుదేరాడు అలా వెళ్తున్న రాముని ఊరి చివర లో మొక్కజొన్న చేను వేసుకున్నటువంటి రంగయ్య ఆపి బాబు ఇలా ఏడుస్తూ వెళ్లే కంటే "వూడ్తు ఆడ్తూ" అనుకుంటూ వెళ్ళు దానివల్ల సాయంకాలం పూట పిట్టలు నా చేనుపై వాలి పాడు చేయకుండా ఉంటాయి అని అతని చేతిలో ఒక బెల్లం ముక్క పెట్టాడు దాన్ని తినుకుంటూ వెళ్తున్న రాము చేను చివర వరకు  "వూడ్తు ఆడ్తూ" అనుకుంటూ వెళ్ళాడు దానితో పిట్టలన్నిఎగిరిపోయాయి

అయినా అంతటితో ఆగకుండా రాము "వూడ్తు ఆడ్తూ" అనుకుంటూ వెళ్ళసాగాడు అలా వెళ్తున్న కొంతసేపటికి ఆ చేను దాపున ఒక ఎరుకల నాగయ్య  కుందేలును పట్టుకోవాలని ఉచ్చు వేసి కూర్చున్నాడు అటుగా వెళుతున్న రాము "వూడ్తు ఆడ్తూ" అనడం వల్ల ఉచ్చు దగ్గరగా వచ్చిన కుందేళ్ళు అన్ని దూరంగా పారిపోయాయి దానితో కోపం వచ్చిన ఎరుకల నాగయ్య  పొద్దటి నుండి కూడు కూడా ముట్టకుండా కుందేళ్లు పట్టుకోవాలని ఉచ్చు వేసి ఆశతో కూర్చున్నాను తీరా అవి  పడే సమయానికి నీవు వచ్చి చెడగొట్టావు అని కోపంతో రాముని చితకబాదాడు దాంతో ఏమి చేయాలో పాలుపోని రాము అయితే ఏమని చెప్పాలో మీరే చెప్పండి అని అడిగాడు దానితో నాగయ్య రాముతో ఇలా అనుకుంటూ వెళ్ళు "ఇది పడాలి ఇంకోటి పడాలి ఇది పడాలి ఇంకోటి పడాలి" అని దాంతో రాము "వూడ్తు ఆడ్తూ" అనే పదాన్ని మర్చిపోయి "ఇది పడాలి ఇంకోటి పడాలి" అనుకుంటూ వెళ్ళసాగాడు

అలా వెళ్తున్న రాముకి ఎదురుగా అడవికి వెళ్ళి కట్టెలతో వస్తున్న ఎద్దుల బండ్లు ఎదురుగా వచ్చాయి అందులో ఒక బండి బురదలో దిగబడింది దాంతో మిగతా బండ్ల వాళ్ళు అగి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు అటుగా వెళ్తున్న రాము "ఇది పడాలి ఇంకోటి పడాలి" అనుకుంటూ వెళ్ళడం బండి బురదలో నుంచి తీయడానికి ప్రయత్నిస్తున్న వారి చెవిలో పడింది దాంతో కోపం వచ్చిన వారు రాముని దగ్గరగా పిలిచి ఏమంటున్నవు రా అని అడిగారు రాము వారితో "ఇది పడాలి ఇంకోటి పడాలి" అన్నాడు దాంతో రెట్టింపైన కోపం తో ఏరా పది రోజులు అయ్యింది ఇల్లు వదిలి వెళ్లి ఇక తిరిగి ఇల్లు చేరువగా వస్తున్నాం కదా అని సంతోషం లో ఉండగా ఒక బండి బురదలో కూరుకుపోయింది అని మేము తియ్యడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు వచ్చి "ఇది పడాలి ఇంకోటి పడాలి" అంటావా అని రాముని చావబాదారు మరి ఏమనాలి అయ్యా అని అడగ్గా వారు ఇలా చెప్పారు "ఇది వెళ్ళాలి  ఇంకోటి కూడా వెళ్ళాలి" అనుకుంటూ పో అని చెప్పారు 

అలా రాము "ఇది పడాలి ఇంకోటి పడాలి" అనే మాట మర్చిపోయి "ఇది వెళ్ళాలి ఇంకోటి కూడా వెళ్ళాలి" అనుకుంటూ వెళ్తున్నాడు అలా వెళ్తున్న రాముకి పక్క ఊరు అయిన బొబ్బిలి నుంచి ఒక శవాన్ని మోసుకొస్తున్న కొంత మంది ఎదురయ్యారు వారి పక్కనుంచి వెళ్తున్న రాము "ఇది వెళ్ళాలి ఇంకోటి కూడా వెళ్ళాలి" అనే మాట శవాన్ని తీసుకెళ్తున్న వారి చెవిన పడింది అంతే కోపం ఆపుకోలేని వారు వచ్చి రాముని చితక్కొట్టారు ఏరా బడుద్దాయి ఇప్పటికే ఊరిలో గత్తర (క్షయ) రోగం వచ్చి రోజుకు నాలుగు ప్రాణాలు పోతున్నాయి మోసి మోసి మా భుజాలు అరిగి పోతుంది ఎడ్వనికి మా కళ్ళల్లో ఒక్క నీటి బొట్టు కూడా లేదు నువ్వేవడవురా ఇప్పటికీ పోయిన ప్రాణాలు చాలవని "ఇది వెళ్ళాలి ఇంకోటి కూడా వెళ్ళాలి" అంటున్నావు అనగా మరి ఏమనాలి అయ్యా చెప్తాం "రామ రామ ఇంత కార్యం కాకూడదు" అనుకుంటూ వెళ్ళమన్నారు

దాంతో రాము "ఇది వెళ్ళాలి ఇంకోటి వెళ్ళాలి" మర్చిపోయి "రామ రామ ఇంత కార్యం కాకూడదు" అనుకుంటూ వెళ్తున్నాడు అలా రాము బొబ్బిలి దాటి భీముని కొండ  అనే గ్రామం లోకి వచ్చాడు అయితే ఆ గ్రామం లోని పెద్ద మనిషి బీరయ్య కూతురుకి పెళ్లి జరుగుతుంది అది కూడా అంతకు ముందు పది ఇరవై సంబంధాలు ఎత్తిపోయి పెళ్లి వయసు దాటి ఇక పెళ్లే కాదు అనే సమయానికి పెళ్లి నిచ్చయం అయ్యింది ఘనంగా పెళ్లి వేదికకు ఊరు సిద్దమైంది ఇక అటుగా వెళ్లే మన రాము "రామ రామ ఇంత కార్యం కాకూడదు  రామ రామ ఇంత కార్యం కాకూడదు" అనుకుంటూ వెళ్తున్నాడు అది విన్న బిరయ్యకు ఎక్కడలేని కోపం తో రాముని పిలిచి ఏరా ఏమిరా వాగుతున్నవు అంటే "రామ రామ ఇంత కార్యం కాకూడదు" అన్నాడు ఎమ్మాట్లడుతున్నవు రా దొంగనాయాల ఇక కాదు అనుకున్న పెళ్లి జరుగుతుంటే కాకూడదు అని పెళ్లి వారికి సమాచారం ఇస్తున్నవారా అని మళ్ళీ చితకబాదారు

అలా అన్ని దెబ్బలు తిన్న రాముకి నడిచే ఓపిక లేకపోయింది అంతే కాకుండా తనను ప్రకృతి పిలిచింది అంటే బైలుకు వచ్చింది దానికి తన వెంట ఉన్న మరచెంబు(గుడ్డు చెంబు)నీ కట్ట మీద పెట్టి చెరువులోకి దిగాడు వచ్చే సరికి ఆ చెంబు పెట్టిన చోట లేదు దాంతో మళ్ళీ ఏడుస్తున్న రాము కు చెరువు పక్కన ఒక పూరి గుడిసె కనిపించింది కాసేపు అందులో పడుకుందాం అని లోపలికి వెళ్ళి అక్కడే ఉన్న గడ్డివాములో పడుకున్నాడు ఆ గుడిసె గుర్రాలు మేపుతూ వాటికి స్నానం అవి చేయించే (కన్నపోల్ల) కామరాజుది

అలా నిద్రిస్తున్న రాముకి ఏదో అలికిడి వినిపించి చూడగా ఆ ఊరు రాజు  రాజారావ్ బహద్దుర్ కూతురు రోజారాణి ఈ కామరాజు కు అలవాటు అంటే ప్రేమలో ఉన్నారు ఇద్దరు ఆ చల్లటి సాయంకాలం కాస్త మద్యం సేవించి రతి క్రీడలో ఉండగా కామరాజు తో  రాజారాణి ఇలా మనం రమిస్తుంటే నీకు ఎలా ఉంది అని అడిగింది అపుడు కామరాజు రొజారాణి తో నాకు కింద ఏడు లోకాలు మీద ఏడు లోకాలు మొత్తం పద్నాలుగు లోకాలు కనిపిస్తున్నాయి అన్నాడు అది విన్న రాము పరిగెత్తుకుంటూ వచ్చి వారితో అయ్యా అయ్యా మీకు కింద ఏడు మీద ఏడు మొత్తం పద్నాలుగు లోకాలు కనిపిస్తున్నాయి కదా నా మరచెంబు పోయింది అది ఏ లోకం లో ఉందో కొంచం చెప్తారా పోయి తెచ్చుకుంటా అన్నాడు అంతే మద్యం మత్తులో ఉన్న కామరాజు వచ్చి రాముని మళ్ళీ చితక్కొట్టాడు దెబ్బలు తాళలేని రాము అక్కడి నుండి పారిపోయాడు 

ఇక తెల్లవారగానే రాము ఊరు నడిమద్యకు బొడ్రాయి దగ్గరకు వెళ్లి "నా కాలికి ఉన్న సిరి మీ రాజు మొఖానికి లేదు నా కాలికి ఉన్న సిరి ఈ దొర మొఖానికి లేదు" అనడం ప్రారంభించాడు అందరూ వింటున్నారు అటుగా వెళ్తున్న రాజ భటులు విని రెండు చేతులు వెనక్కి విరిచి కట్టి రాజు గారి దగ్గరికి లాక్కు పోయి రాజా ఇతను ఎవరో కానీ "తన కాలికి ఉన్న సిరి మీ మొఖానికి లేదు" అంటున్నాడు అని చెప్పారు అపుడు కూడా వెనక్కి తగ్గని రాము అవును రాజా "నా కాలికి ఉన్న సిరి నీ మొఖానికి లేదు" అన్నాడు కోపం తో ఊగిపోతున్న రాజు ఏరా ఎందుకు అలా అంటున్నావు అని నిలదియగా అవును మరి నువ్వు రాజువెంది నీ కూతురు కన్నేపోనికి అలవాటెంది అందుకే అంటున్న "నా కాలికి ఉన్న సిరి నీ మొఖానికి లేదు" అవునా అది నిజమా నిరూపిస్తావరా హా రండి అని అందరూ కలిసి ఆ గుడిసె దగ్గరికి పోగానే అందులో ఉన్న ఇద్దరినీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు

అది చూసిన రాజు వాళ్ళను వెంటనే గ్రామం నుంచి తరిమి వెయ్యండి అని ఆజ్ఞాపించాడు రాము చేసిన పనికి సంతోషించిన రాజు గారు కొడుకులు లేని నాకు నువ్వే కొడుకై నన్ను నా సంస్థానం కాపాడమని రాముని చెరదిశాడు అలా అన్ని దెబ్బలుతిన్న  రాము రాజు(చక్రవర్తి) అయ్యాడు 

ఒక మంచి ముహూర్తం చూసి రాముకి పట్టాభిషేకం చేసి బాధ్యతలు అప్పగించారు ఆ వేడుకకు వెళ్లిన నాకు పట్టు బట్టలు కూడా పెట్టారు 
------------------------ విజయోస్తు ------------------------

రచన : తాజ్ 
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...