ఎవరు గొప్ప..













ఈ కవితా మాలికలు
కవి గా ఓ సామాన్యుని మనసు సూత్రాలు

కొవ్వొత్తి వెలిగిస్తూ ఇది నా వల్లే ఇంత ప్రకాశిస్తుంది
అనుకుందో అవ్వ

కానీ అందుకు సహకరిస్తున్న గాలి
దానికి ఊతం ఇస్తున్న తైలం
అంత బాధని ఓర్చుకునే దారం

అవి లేక సాధ్యం అయ్యేనా కాదు కదా..!

నేను నల్లగా ఉన్నాను అందువల్లే ఈ కొవ్వొత్తి వెలుగుకు 
ఇంత విలువ అని వెకిలిగా నవ్వుతుంది రాత్రి
మరి ఎవరు గొప్ప..?

కనులు మూసుకుని పాలు తాగుతున్న పిల్లి
నన్ను ఎవరు గమనించరు లే అనుకుంటే..?

ఇది లోకోక్తి..!

నిద్రలోనో ఐశ్వర్యం లోనో కనులు మూసుకుని రాజు
నాలాగే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంది అనుకుంటే..?

మరి ఇది కక్కుర్తి...!

అనాదిగా అధిపత్యం కోసం
మత పిశాచులు, ఛాందస వాదులు, 
దనికాసురులు పోరినా..

ప్రస్తుతానికి అది స్త్రీ పురుషులు అని
వర్గాలు గా విభజించి పోరుతున్నరు
ఎవరు గొప్ప..

చూసే చూపు చెప్పే పదం చేసే పని
దేని మీద నిలకడ లేని ఈ నర బొమ్మలు
ఇంత వీరంగం వేసి మిగిలేది ఎన్నాళ్ళు రా..

నాలుగు రోజుల ఈ బూలోక యాత్ర ను నరకంగా మార్చి
సాధించేది ఎంది..?

గతించే కాలం, చేజారే యవ్వనం
ఎందుకు పంతం, ఎవరికి నీవు సొంతం 
మిగిలేది నీకు నీవే నేస్తం

రచన : తాజ్ 
పల్లెటూరీ పిల్లోడు


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...