శ్రీ శ్రీ జయంతి వేడుక...








శ్రీ శ్రీ జ్ఞాన గని, సాహిత్య ధుని

అఖండ భారతం జోతలిడు మోని

అభ్యుదయ కవితా కీర్తికి తానే నుడి

తన కలం విదిల్చు అక్షరాలు వాడి వేడి 


కొడిపెద్ది వెంకట రవణమ్మ అప్పలకొండ 

తొలి కడుపు పంటవై

వారి హృదయాల్లో గీసుకున్న రూపానికి సాక్షమై

భానుడల్లే ప్రకాశిస్తూ ఒడిలో నువు చేరావు 

నీ కన్న తల్లి ముద్దు చేస్తే ముసి ముసిగా నవ్వేవు


దేవకిని వీడి యశోదను చేరిన కృష్ణయ్య మల్లె

కోడి పెద్ది ఇంట వెలసి, శ్రీ రంగం పేరు బడసి 

శ్రీ శ్రీ గా వెలిగావు నాలోని కవికి నీవు దిక్సూచి అయ్యావు 


రేపన్నది ఉన్నదని నీవే నీ ఆయుధమని

సోమరులకు చెంప చరిచి నిలవక పరిగెత్తమని

నిప్పు రవ్వ లెగసి దూకు కవితలేన్నో రాసావు

సుత్తి కొడవలి చేతబూని జ్ఞాన విత్తు వ్యవసాయం చేసావు

కవితలనె పంట తీసి నా ముందర పొసావు


శ్రీ శ్రీ జయంతి వేడుక...

అభ్యుదయ కవితా యుగానికి అసలైన పండుగ 

ఆ భానొదయ కిరణం వలె మీ రచనలు మాకు ప్రేరణ 

నా చేతిలో కలం కదిలినన్నాల్లు మీ పేరే నాకు స్పురణ...!


రచన : తాజ్

మీ పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...