అవని ఒడిలో అమ్మ వేదన..













ఒంటరి బతుకున ఎంతటి కేధం
చంటి బిడ్డతో సాగెను సేద్యం
ఇది ఎవని పాపమో, ఎంత చొద్యమో
అప్పు ఊబిలో పెనిమిటి ప్రమిదెమో

సంద్రపు నీరె ఆవిరి చేసి
కన్నుల జారెను వర్షపు చినుకై
పూల దారులే ముళ్ళ పొదలుగా
మేలు రోజులే కిడు కోరగా

గుండె మెండుగా బిడు వారగా
ఆశలు జారి నిరాశ చేరి
అడుగే తూలి ధరిపై కూలి
ఆవేదనలో అడుగులు పడునా

ఈ రోదనలో గమ్యం చేరునా
సొంతం అంటే పంతం పట్టి
ఎంతకెంతని వంతులు వేసి
అంతకంతకూ గోతులు తీసి

అహర్నిశలు శ్రమించినా..!
ప్రతిఘటిస్తూ పయనించినా
ఫలం దక్కునా, భలం చిక్కునా
ఏ దారైనా ఇదే నా తొలి అడుగు

ఆ అడుగే ఆశ్వాలంటూ
ఆనందానికి కళ్లెం వేస్తా
అభివృద్ధికి వలవేస్తా
జాతి గర్వించగా వన్నెతెస్తా.....!

 రచన : తాజ్ 
 పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...