మన్నిస్తావా ప్రియా..(ప్రేమ దారిలో)













ఎవరు నీవు..?
ఏ కొలనులో తామరవు
ఏ గూటిలో కోయిలవు..!

కార్తీక మాసపు దీపాలన్ని ఒక్కచోట చేరితే
ఆ ప్రకాశమంత పూసుకున్న వదనంతో
ఉత్తమమైన అభినయము తో
ఉత్యుత తెలంగాణ లో అడుగిడిన ఆడపడుచువో

ఉల్కలై రాలిన చంద్రుని ముక్కవో
గ్రహాంతరవాసివో, బృహస్పతి పుత్రికవో
బృహోత్తమమగు నా ప్రేమకు రూపానివో

అంగబలం భుజబలం అన్ని నీవే నాకు 
నీవు లేక ఏ విజయం రాదు నాకు..
 
మరి నేను..?
కూర్చున్న కొమ్మను నరికాను, ఆదరించిన చేయి విరిచాను
ప్రేమ పాశం మరిచాను, నోటి పూజతో చెలరేగాను🗣

చిన్న పిల్లాడి మనసు నాది..
నీ సూపు లేకుండా నడవనిది, నీ మాట వినకుండా మనలేనిది

మన్నిస్తవా ప్రియా..........
నా దారిలో అడుగు కలిపి, మన ప్రేమను గెలిపిస్తావా
మన ప్రేమ దారిలో కవితా కుసుమాల పంట వేద్దామా..!
-------------------------------------------------------------++++++

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...