చరవాణి లో నా దేవేరి(స్క్రీన్ వాల్ పేపర్)













పూసిన మల్లియ పరిమళించేనని
కొలనున తామర రెల్లు విప్పెనని
నెలవంక ముక్కలై నోట ఉరెనని
నా చేతి యంత్రమును తొంగి చూస్తువా
నవ్వి నవ్వుతో నాకు లెంక వెస్తువా

తొలకరి చినుకులు అల్లరి ఆటలా
తూనిగమ్మ రెక్కల సడిలా
చెవిలో మ్రోగేను నీ నవ్వు 
రెట్టింపాయేను మన లవ్వు

ప్రశాంతము నవ వసంతము
సమస్తము నీ సాంగత్యము

సుమాల వారాల హారములన్ని
పావనమౌ నీ పాదము తన్ని
తరించినవి నీ పేరు జపిస్తూనే
తనువు చాలిస్తూ మాట ఇచ్చినవి

వెన్నెల పూలై పూస్తాయట
నీ కొప్పున గర్వంగా నిలుస్తాయట

వయారమ్మ నీ వయారి హాస్యం
సుగంధాలు విరజిమ్మే సువాసన పుష్పం
సాగర మధనం చిలికిన కవ్వం
దరిపై గిరిలా కిర్తుల పర్వం

తప్పక చెప్పని గొప్పని తత్వం
తప్పుగ చూడక ఒప్పని పరువం
ఇప్పుడు తప్పదు తప్పుడు కార్యం
నీ కౌగిలి కానక కించేను ఘోరం..!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...