అమృత మూర్తి మా అమ్మ

 








మాతృ మూర్తులందరికి నమస్కరిస్తూ... 

నిర్వచించ లేని కొలమానం మా అమ్మ

కష్టాల కల్లోలం లోను చెరగని చిరునవ్వు మా అమ్మ 

కలిమి లో పుట్టిన, లేమిలో నెట్టినా

మా నాన్నని మెట్టిన నుండి ఆగని పోరాటం

కంటి బిగువున కన్నీటిని దాస్తూనే మాకై ఆరాటం

గుండె నిండా నిబ్బరం, నాన్న తోడే ఆయుధం

అమ్మ ప్రేమను వర్ణించడం కన్నా ఆకాశం లో నక్షత్రాలు లెక్కించడం తేలికైన పని


అమ్మ అని పిలుపే ఔషధ ప్రదాయి

పిల్లల అభ్యున్నతే తల్లి దండ్రులకు హాయి

లాలి పాటల జాబిలి, ఒడి ఊయల కౌముది 

మా అమ్మే మా ఆమని, జన్మకంతా సేవించడమే నా విధి


మరి ఆ తల్లికి....?


ఆపత్కాలమందు చేయి అందించు 

ఆశీస్సులంది చిరంజీవి గా గర్వించు 

అమ్మ ప్రేమను ఆస్వాదించు 

అట్టి ప్రేమను అందించిన ఆ తల్లికి లేస్తూనే నమస్కరించు..


నా మాత్రుమూర్తికి అశ్రుబిందువులతో పాదాభిషేకం

ఈ కవితా పద్మములు నా తల్లి పాదాలకంకితం

కవితా లోకపు తీరాన, కవిగా మారిన సమయాన 

అమ్మే స్ఫూర్తిగా నిలిచేనే, భుజం తట్టి నడిపెనే


నా చేవ్రాలు తో 

అమ్మ కి అమ్మ అయిన మా అమ్మాయికి (నా భార్య) 

మాతృ దినోత్సవ శభాకాంక్షలు


రచన : తాజ్

మీ పల్లెటూరి పిల్లోడు

-------------++++++++++++

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...