రాయంచ నడకతో, మత్తెక్కించే నవ్వుతో








ఇది నిజమా...!
అందమైన అబద్దమా తెలియదు కానీ
నా మనసు మాట విన్నవిస్తున్నా
నా మది ఆలోచన నీ ముందు ఆవిష్కరిస్తున్నా

అందం అంటే నువ్వు
అనురాగం అంటే నీ నవ్వు
మమతానురాగానికి మరో పేరు నువ్వు
నా కనులు కాంచిన అతిలోక సుందరి అది నువ్వే

నీ నవ్వుల గలగలలకు సెలయేరులు సాటియెల
నీ నడకల సవ్వడికి రాయంచ పోటియెల
నీ గొంతుశోభ సంగితాలు పలుకలేవు కోయిలైన

నీ గళం నాజూకు నీ పలుకు నేను చూసి వణుకు
నీ చూపు నను వెతుకు నీ అడుగులు నా వైపు సాగు
నీ చేయి నా చేయిన నిలుపు
మన ప్రయాణం ఒకటేనని చెప్పకనే చెప్పు

నువ్వు నా గమ్యం, నీవే నా ప్రాణం
నువ్వే నా సర్వం, నీ నవ్వే నాకు సర్వస్వం
నీ నవ్వు చూస్తున్నంత కాలం రాదు నాకు వయోబారం

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...