బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో (మధ్యతరగతి మనిషి)

బ్రహ్మయ్యా..

ఏమయ్యా బ్రహ్మయ్య
నీ శిరోభారాన్ని నీవు మోయలేక
నా తలకెక్కించి
బ్రహ్మ ముడిని చిక్కు ముడిగా చేసి
విప్పుకొలేని తప్పుకొలేని బాధ్యతలతో
ఉరి వేసి మెలివేసి మెడనంత నులిమేసి
చంపుతున్నావా...?

నీ శిరోభారాన్ని నా తలపై మోయలేకున్నానయ్యా
భారాని దింపెయి.. లేదా భాధల్ని ఆపెయి..

నారాయణ..

ఏ తోడు లేకున్నా
నీ నీడలో చేరి
మోడులా మారి భాద్యతలు మోస్తున్నా కదయ్యా
మోస్తున్న భారాన్ని పెంచుతున్నట్లు
బరువు మీద బరువు నా నడుముపై వేస్తే
మోయాలేకున్నానయ్యా..!

బరువును దించేయి లేదా బ్రతుకును బలిచ్చేయి..

మహేశ్వరా..

నీ గొంతులోని గరళాన్ని
నా బ్రతుకులో పారబోసి
హాయిగా నవ్వుతున్నావా శివయ్యా
గొంతు గరళం నిండి గడియ గగనమై
గరళమే గుటకకింత మింగుతున్నట్లు ఉందయ్యా

అమృతం అక్కరలేదు కానీ..
గరళాన్ని లాగేసుకో లేదా గళం లో ప్రాణం లాగేసుకో

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...