మన ప్రేమకు పిల్లల కానుక..








మేఘం రంగు
ప్రేమ పొంగు
ఎప్పుడు మారునో చెప్పలేము

మేఘం రంగు మారితే నెమలి చెంగు మంటది
ఉరు మెరుపుల నడుమ ప్రకృతిని పరవళ్ళు
తొక్కించగ ఒక నీటి ధార నేల జారుతుంది

ప్రేమ పొంగేనా ఆమనిలా నా పిల్ల
సిగ్గు ముసుగుతో తుళ్లీ ఆడును
సప్తవర్ణముల మేళవింపు తో ఓ నవ్వు విసురును
అది ముసురు కమ్మిన ఆకాశంపై తెల్లని బట్ట కప్పును

వెన్నెలలా నా ఇల్లంతా వెలిగిపోవును
పండగలా వీధి అంతా తొనకిసలాడును
పసిడి ఆభరణములే ఆ నవ్వుకు
వెండి గిన్నెలుగ మారిపోవును
తన కాంతి వెరసి విస్తుపోవును

నెలరాజుకు ఇక సెలవంటూ
పిల్ల పాపాలు కేరింతలు కొట్టి
ఈ తుంటరి పిల్లకి తోడుగ చేరి
రాత్రులు మరిచి ఆడెరు

మన ఒంటరి మనసులు జతచేయ
ఆ వెన్నెల పందిరి విడిదంటూ
పెళ్లికి పెద్దలు అయ్యేరూ
మన పెళ్ళి జరుగగా మురిసేరు
నిను నా చేతిలో పెట్టి వెళ్ళేరు..
-------------------------------++++++🪄
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...