బాల్య స్మృతులు...(పాట)









చరణం :
మనసు మరవలేనన్నది నా బ్రతుకు సాగలేనన్నది
మనసు మరవలేనన్నది నా బ్రతుకు సాగలేనన్నది
పచ్చని నా పల్లె ప్రకృతిని విడనాడి
పట్నంలో నా బ్రతుకు హినమే అనిపిస్తే (మనసు..)

పల్లవి :
ఇల్లు వాకిలి వదిలి నా పల్లె నిన్నొదిలి
అక్కున చేర్చేటి అమ్మను వదిలి
హాయిని పంచేటి నాన్నను వదిలి
గడియైన విడిచి ఉండాలేనంది
గాలిమాటు గమనం వద్దాని చెప్పింది (మనసు..)

పల్లవి :
పండుగ రోజుల్లో పల్లెల నా ఆట
సంక్రాంతి బోగీల సద్దుల బతుకమ్మ
దసర పండుగలంట పీరిల జాతర
ఉపవాస దీక్షలు ఊరంత అందాలు (మనసు..)

పల్లవి :
కట్ల బుచ్చయ్య బావి నేర్పిన ఈత
కల్లు కుండల కొరకు చేసిన దొంతర
సర్కారు బడిలోన చిన్న పిల్లలమంత
చల్లంగ కూర్చొని సాగిన ముచ్చట (మనసు..)

పల్లవి :
కొత్తపల్లి గోరి నా పల్లె నిండా
తీరొక్క మనుషుల తీరైన దందా
కులమతాలేవి మాకు లేవంట
అందరూ కలిసి కూడుండే పొదరింట (మనసు..)

పల్లవి :
నాలుగు దిక్కుల్లో కుంటలు నిండు
వాటి దాపున ఉన్న మామిల్ల పంట
దొరగారి బంగ్లోలే కూలిన మెడల్ల
ధన గర్వమన్నది లేదు నా పల్లెల (మనసు..)

పల్లవి :
మసీదు చేరువలో నల్లరాతి బండ
పెద్దమనుషులు చేయు పంచాయితీకి అడ్డ
ఎవ్వారీ భాదయిన తీరును ఆ పూట
మాట తప్పని మంచి మనుషులకు తావంట (మనసు..)

పల్లవి :
ఎట్లయిటే గట్లాయే ఏదయితే ఏమాయే
పల్లెను నే వదల పట్నంలో పురిగొల్వ
ఊరు ఊరు దిరిగి పోరునే రాజేస్తా
యువత భవిత కొరకు దిక్షలైన జేస్తా (మనసు..)

చరణం :
మనసు మరవలేనన్నది నా బ్రతుకు సాగలేనన్నది
మనసు మరవలేనన్నది నా బ్రతుకు సాగలేనన్నది
పచ్చని నా పల్లె ప్రకృతిని విడనాడి
పట్నంలో నా బ్రతుకు హినమే అనిపిస్తే (మనసు..)
---------------------------------------------------------------
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...