మనుటయా, మరణించుటయా...!









ప్రేమామృత ధారలు అడుగింకి
అశ్రునయనాలతో ఆకాశాన్ని అర్ధిస్తూ
ఈ యడబాటులో శూన్యాస్తములు చాచి
నా హృదయ సామ్రాజ్య ఎలికకై విన్నపము
కలలో మెదిలే నీ రూపాన్ని కనులముందు నిలిపి
క్షమించమని అడగనా కరుణించమని ఎడ్వనా
ఓ ఒంటరి బాటసారినై
ఇక్కడనే మనుటయా, మరణించుటయా...!
ఇది అన్యాయమా, లేక విధి నాటకమా
త్రివేణి సంగమ అద్భుత ఝరి నీ నవ్వుల సవ్వడి
ఒరుపు నేల నురగల వలె నీ పలువరుసల అలజడి
ప్రియా.. నేడు కరువయినవి, మది బారమైనది
ఎ వాల్మీకి రాయని రామాయణం నా బ్రతుకైనది
అరణ్యముల పాలై బ్రతుకు బరువైనది
అలసిన నా ఆలన సొలసినన నా పాలన
అనుకరించు ఆప్తురాలు, ఆర్తి తీర్చు భక్తురాలు
నీవు లేవైతివి నాకు కరువైతివి...
పాడు కాల పరీక్షలో నీవు లేక ఎడారి ప్రయాణం నాదయినది
++++++++++++++++++++++++++++++++++++🪄
రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...