మాయల 'మని' షి (కులం పిచ్చి)



*శీర్షిక : మాయల 'మని' షి (కులం పిచ్చి)* 

ఘనమైన స్వతంత్ర రాజ్యంలో, నాడు మొదలు నేడు వరకుఅగ్ర వర్ణ శోభితం, కడ జాతులతో పాద సేవనంగుణం చచ్చి, కులం రెచ్చి, మతం చొచ్చి మనిషిని మార్చిమనం అన్నది మరిచినాడు, మందిని ముంచేదిగినాడు
కులం ఏదైనా మలం తినమనలేదుమతం ఏమైనా మరణానికి అడ్డురాదుపని ప్రాతిపాదికన పుట్టిన కులానికిఅదో ప్రత్యేకత ఆపాదించకుసమస్త మానవాళి ఒక తల్లి పిల్లలం అని మరువకు
మనిషి కుంచిత స్వేచ్చ విధానంలోస్వతంత్రం - స్వలాభం, స్వరాజ్యం - స్వబోజ్యంసానుకూలత - పేరు కులట, సమానత్వం - అమానుషత్వంఅనుబంధం - అబద్దం, మానవత్వం - వినాశక మత్రం
వినుతికెక్కిన గణతంత్ర దేశంలోఎక్కడుంది ఘనం, మనిషి మనిషిలో ఖేదంఎక్కువ తక్కువల తో ప్రాంతీయతల విభేదం, ఎందుకు పంతం, ఎవనికి సొంతం జీవితమంతా పరుగులతో అంతం
రౌడీ రాజకీయకుల ఆయుధం ఈ కులంఅన్నదమ్ముల మధ్య అగాధం ఈ మతంశాస్త్రోక్త గ్రంధములెవైనా సారం ఒక్కటేరాము, రహీమ్, రాబర్ట్ ల కణములోని అనువంశిక పదార్థం(DNA 🧬) ఒక్కటే...
రచన : తాజ్ అంశం : మత సామరస్యం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...