మయూర మనో రోదన...!













అరణ్యాల అందాలు ఎర్ర మట్టి గంధాలు 
పారుతున్న సెళయెళ్ళు సెదతీరు నేమళ్ళు 
వాన ముసురులో నేమలి నాట్యము 
చూసి మురిసిన కనులు ధన్యము 

జాతి పక్షి అంటూ ఓ కీరిటాన్ని పెట్టాము 
ఇంటి శోభ అంటూ దాని కంటి క్షోభ చూసాము 
గూళ్ళ లోన పెట్ట చూసి గాట్లు పోట్లు పొడిచాము 
ద్రౌపధి లా బట్టలిప్పి భలె భలే అన్నాము 

రంగు రంగుల ఈకలు పీకి 
ఫకీరు చేతిలొ విసనగ మార్చి 
రంగు అద్దాల గోడ మేడలకు 
కళ చెదిరి అవి ఘోషిస్తుంటె 

అలంకారమని అనుకున్నాం 
ఆ జాతిని పూర్తిగ భలి పెడుతున్నాం 
బలిరా బలి ఓ తమ్ముడా 
ఆ పాపం మానరా మా అన్నయ్యా..!
------------------------------------------------🪄
రచన : తాజ్ 
మీ పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...