దేశాన్ని నడిపించే నాయకుడు కావాలి...! (Happy independence day)


 






రాజులు, రాచరికాలు, దొరలు, భూస్వాముల చెర వీడి 

1500 సంవత్సరములు పరాయి పాలనలో మగ్గి సాధించుకున్న స్వాతంత్య్రం ఒక కుటుంబం పాలనలో, రాజ్యాంగం ముసుగులో 

60 ఏళ్లు ఏ అభివృద్ధికి నోచక వాడిన భీడులా, 

పాడుబడిన రాజ సౌధంలా, పశువుల కొట్టంలా మారిపోయింది, సాధించిన స్వరాజ్యంలో కూడా అర్హులకు ఏ లబ్ది చేకూరడం లేదు


అన్నమో రామచంద్ర అని అలమటించే రైతుల బలవన్మరణాలు

బుక్కెడు అన్నం దొరకని అప్పులలో కూరుకున్న నేత కార్మికులు

దేశమంతా కార్పొరేట్ చట్రంలో పరిమితి లేని పని గంటలతో వ్యర్దం ఈ జీవితం అని అలమటిస్తున్న నిరుద్యోగులు


ఆర్థికంగా ఉన్నా ప్రభుత్వ సబ్సిడీ పొందే అభాగ్యులు

చేతిలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా రేషన్ వీడని అదృష్టవంతులు

ఉద్యోగం ఉద్యోగం అని నిరుద్యోగులు ఊరురా తిరుగుతున్నా 

ఉద్యోగం ఉన్నవాడికి 40% ఫిట్మెంట్ ఇచ్చే ప్రభుత్వాలు


ఇంటికో ఉద్యోగం ఉత్తి మాట..

ప్రగల్భాలతో ఎక్కి కూర్చున్నారు గద్దె పీట..

ఈ దుస్థితిని మాన్పూ చేసే నాయకునికై నా వెతుకులాట..!

................................................................…......++


రచన : తాజ్ 

పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...