మరణించినా మరచిపోలేని ప్రేమను నేను...! (తిరస్కరణ)

 

ఎడారిలో సంద్రం లా
నీ ప్రేమ ధార పొంగిందని
అది ఆ క్షణం అమృతమై
నన్నింతకాలం ఓదార్చిందని

నా ' నీ ' అను పదాలు మాసిపోయి
మన అను భందమేదో నెలకొని
ఇల నన్ను నిలిపిందని
నీకు నే అనేకానేక మార్లు విన్నవించాను
నినదించాను, నివేదించాను

నీ ప్రేమ వర్ష ధారల తడిసి
మోడు నా మనసు పులకించిందని
పూ రేకులా వికసించిందని
నీకు తెలిపాను, తేటతెల్లం చేశాను

అర్హత లేని అలగా వానిగా
ఈనాడు నీ ముందు కూలపడ్డాను
ఆసరా అందించే ఆపన్న నీ హస్త బంధాన్ని
అశ్రు ధారలతో ఆలింగనం చేయాలనుకున్నా
నా అభిలాషను నిజం చేయాలనుకున్నా

నిన్ను దూరం చేసుకుని
తెరచాప కూలి, చుక్కాని విరిగి
ఒళ్లు చిల్లులు పడిన నావలా
గమ్యం మరిచి రేవును విడిచి
నీ ముందు దీనంగా కూర్చున్నాను

గత్యంతరం లేక కాలగతిలో
కరిగి తరిగి చిరిగి మునిగిపోతున్నాను
ఒక్కసారి నిన్ను చూసి
కన్ను మూయాలనే ఆలోచనలో ఉన్నాను..!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...