కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు (అనే అక్షరం అక్షయమై నిలిచింది)

 








కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు

(అనే అక్షరం అక్షయమై నిలిచింది)


కల్వకుంట్ల వంశానికి కీర్తి పతాకమై
రాఘవరావు వెంకటమ్మ కలలకు రూపానివై
చంద్రుడల్లే గోచరిస్తు ఒడిలో నువు చేరావు
కన్నతల్లి దీవెనతో మా గతిని మార్చ కదిలావు

చంద్రశేఖరుడను నామంతో చిరంజీవివయ్యావు
అరవయ్యేళ్ళ గోస చూసి రుద్రుడల్లే రగిలావు
పరాయి పాలనపై కళ్లునురిమి ఉరికావు
అయ్యోనివా పాలోనివిరా బై అని అడిగి కడిగేసావు

ప్రో.జయశంకర్ సార్ ఆశయాల శిష్యుడవై
రాజకీయ శక్తితోనే స్వరాష్ట్రం సాధ్యమని
తెలంగాణ రాష్ట్రసమితి స్థాపనకై కదిలావు
మలి తెలంగాణ ఉద్యమానికి రథ సారధివయ్యావు

చలిచీమల దండువోలె సబ్బండ వర్ణాలను పోగేసి
విషనాగుల తరుముటకై జంగుసైరన్ మోగించావు
సకల జనుల తరుముటకై జంగుసైరన్ మోగించావు
కవి గాయకులతో చేరి చలో ధూంధాం అని గర్జించావు

గొచి ఊడపికి మరి సరిహద్దులు దాటించావు
స్వరాష్ట్రమా కల కాదు కదా! అని విస్మయం కలిగిస్తూ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని సగర్వంగా వినిపించావు
హృదయ సింహాసన డోలిపై ముఖ్యమంత్రివయ్యావు

ఈ రోజుకు మా జీవితాల్లో నవ్వు పూవు చేరింది
ప్రతిదినం పండగల్లే ఇల్లు వాకిలి పూసింది
వర్ధిల్లు దైవమా, ఉద్యమ జోహార్లు నాయకా..
నా మరణం వరకు నీవే మా ఎలికా....!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...