ఉత్తమ సాహితీవేత్త (ఉగాది) పురస్కారం-2021


 జోర్ధార్ తెలుగు దినపత్రిక వారు తెలుగు భాషా సాహిత్యంలో విశిష్ట కృషికి గాను అందించిన ఉత్తమ సాహితీవేత్త (ఉగాది) పురస్కారం మరియు ప్లవ నామ వాసంతి కవితా సంకలనం లో నా కవిత 🙏




ఉగాది శభాకాంక్షలతో...!

తెలుగు సంవత్సరాది ఉగాది, తెనుంగు సంసృతికిది పునాది
చిగురు తోడిగేను ఊరి పానాది, చిందు లేసెను మా మదిసౌధి
సాంప్రదాయము కాదు దయ్యం, సంపాదనే కాదు ద్యేయం
జ్ఞానమేమి వనరుకాదు, ధనం తెచ్చే ఎరువు కాదు 

జనవరిని జాతరనకు, కొత్త సాలును యాది మరవకు
పంచాంగ శ్రవణం రేపటికి బరొసా, షడ్రుచుల పచ్చడి బతుకు తమాషా
పాత రోజుల యాది, రేపు రూపం ఎది..? నేడు మాత్రమే నీది నేడే నిజం వద్దురా బేసిజం సాయగుణం నలుగురికి ప్రయోజనం 

పండగని పోంగి పోకు నీ కడుపు నింపుకు నిద్రపొకు
ఒక్కరికైనా అన్నం పెట్టు స్వర్గం అను కోటకదియే మొదటి మెట్టు
స్వార్ధం కూడే ధనార్జన వీడు పాపపుణ్యాల చదరంగం లో
నిచ్చెనే జయం రా నలుగురు మెచ్చేలా బ్రతకరా

సహో అనాలన్న సహస్రాబ్ది కి నీవు గుర్తుండాలన్నా
మంచిని పెంచు కీడును తుంచు 
నేర్పు నీది కావాలి మార్పు సమాజానికి రావాలి
శ్రీ ప్లవ నామ సంవత్సర శుభాలు నీకే 
ఏ వ్యయాలు లేని జయాలు మీకే

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...