అందాల నీ రూపు అతివలకె తలవిరుపు (బిన్నంగా)

 

నీ రూపమే సుజల అమృతం

నీ నవ్వే నాకు మరుల దీవెనం

నీ సోయగం సిరుల తాపనం

అన్నుల మిన్నుల లేదు లేదు ఈ అందం

విరుల మారాణి నిత్య నీ యవ్వనం

నా కనుల ముందరే సాగింది నృత్యమై..


అందాల నీ రూపు అతివలకె తలవిరుపు

నీ అంద వర్ణణకు కవికులకు బహు బెణుకు

ఎంత పొగిడినా గాని కలదురా వెలతి

ఎన్ని జన్మల పుణ్య ఫలము నా కనులది

నిన్ను చూస్తూ ఉంటే ప్రాణమే ఆగది

ఆడ జాతిలో నీవు మేలైన దానివి


జనం నిన్ను చూడ బారులే తీరని

నీ కాలు తొక్కించి ఆశీర్వదించని

చేతులనే పూబంతులుగా మలిచి

పరుస్తాను నీవు రావగా జూసి

కనుల నిన్ను దాచి, కన్నీరు తుడిచి

కర్మ ఫలములెల్ల అనుకూలగా జేసి

అందలం లేకున్న, మేడ మిద్దెలు బోగ భాగ్యాలు రాకున్న


నా గుండె రాజ్యాన పట్టపు రాణిగా

నన్ను పాలించవే నాకు ఆర్ధాంగిగా

మన జంట నూరేళ్ళు హాయిగా ఉండని

పిల్ల పాపల తోని చల్లగా వర్దిల్లి

కాటికైన మనం కలిసే చేరాలి

కాయమున్నన్నాల్లు కాస్తాను మిమ్మల్ని...


రచన : తాజ్

పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...