నా సోకు గత్తెకు స్వాగతం..!

 








సరసాల సావిడిలో
పండగ ఘుమ ఘుమ లోగిలిలో
మధురసాల నీ చల్లని ఒడిలో
మృధువగు నీ చెక్కిలి కెరింతలలో

గోపుర మణి ఎత్తులలో
తీగ వంకల నడు కెంపులలో
రాజహంస నడకలో
రాజసం ఉంది సుమ
నీవే నా దైవపు ప్రతిమ

శ్రుతి నీ మాట, లయ నీ ఆట
సరిగమలు నీ మేనులో పుట్టిన వంపులు
నీ కదలికతో మారిన ఆకృతులు
అవే మన పెళ్లి పండగకి బహుమతులు

కరుణివో, రమణివో
మధువులో సుమ రాణివో
కన్నులు తెరువగనే కానవచ్చు ఆలివో
కురుల సామ్రానితో ఇంట తిరుగు ఇల్లాలివో
అదరముల పై కాచి వేడి రసంబులిడు అర్థాంగివో

ఉదయ సంధ్యల నడుమ అలుపులేక
నీ ప్రేమ లోకమున ఊరేగించు దేవతవో
నా ప్రాణ ప్రియ దేవతా పుష్పానివో
శుభోదయమా వందనం
నా సోకు గత్తెకు అభివందనం...!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...