మిద్దె మీది అర్రలో ఆ ఇద్దరూ..!

 








మిద్దె మీది అర్రలో ఆ ఇద్దరూ..!

ప్రకృతిలో అందమైనది...?
చలి కురిసే మాసంలో చెలి కౌగిలి..!

తన నులి వెచ్చని కౌగిలిలో, చలి తరిమిన మధు గిలిలో
యవ్వనాల పూగుత్తుల ఎత్తులలో చేరగానే పారిపోవు
పాడు చలి, ముద్దివ్వగ మొదలాయేను కా(మ)థా కేళి
ఆ కౌగిలి ఓ స్వర్గము, గిలి గింతల సుమ పర్వము
అది సఖల శుభాలకు నిలయము, సఖునికి ఓ వరము

యవ్వనాల పూదోటన...!
ముసురుకునే బ్రమరంభుకు మకరందమే ఆనందము
పూబంతుల చేమంతుల కౌగిలింతే తన భాగ్యము

నిన్ను చేరు నా ఆశకు..!
బింబాదర మధురిమలలో, బిగి కౌగిలి ఘుమ ఘుమలలో
గొళ్ళెము లేని లోకములో, కన్నము లేని అర్రలో
నిను అనుభవించుటచే నా జన్మ పావనము, పుణీతము.!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...