నీ పాద కమల సేవ నాకు దయయే గదా...!

 








నీ పాద కమల సేవ నాకు దయయే గదా...!

పచ్చనైన పందిరిలో...?
స్వచ్ఛమైన మనసుతో నన్ను దోచుకుంటివి
నీ నుదుట నిలుపుకుంటివి నీ జడన తురుముకుంటివి

నా గుండె సవ్వడి నీ పాదముద్రల వెంటసాగి
మువ్వలుగా మారెను అవి ఘల్లుమని మ్రోగెను
నా కనుల రాలు ఆశువులే అక్షింతలుగ రాలెను
నా గుండె పగులు ఆర్తాలే గట్టిమెలమాయేను

నా రక్త ధాతువులే వధూవరుల సింధూరమై
నా ఆర్తి పాట మెలానికి ఊరువాడ గొల్లుమని
నా చావు కోరి ఆకాశపు దారులన్ని తెరియును
నా చివరి చూపు నీ బుగ్గ మీద దిష్టి చుక్కగ మారును

నీవు నడచు దారులలో నా ఆత్మ నిలిచిపోవును
నీ పాద ధూళి రువ్వు హాయి తాకగానే మురియును
నీ పెదవిపైన నవ్వు చూసి చేమంతులు సిగ్గు పడి
నీ చూపు తగిలి చల్లబడి మేఘములే కరిగిపోయి
వర్షధార పొంగదా పుడమి పులకరించదా...?

అంతమైతి నీ సొంతము కాక
అంతలోనే జన్మించితి నీ ప్రేమ తోడ
నీ చేతుల పాపాయిగ మరో సారి ధన్యత
జారిపోయిన నా ప్రేమకు ఇలా మరో రూపున........!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...