హద్దులేని మరు ముద్దు తాపనం..!

 








హద్దులేని మరు ముద్దు తాపనం..!

ఓ నీల వేణి నీ కులుకు సోయగం
మదిని ముంచెనే కనుల నిలిచేనే
దరికి పిలిచేనే సోకు పంచేనే
నీ పలుకు చాలునే విన్న ధన్యమే

నిదుర లేవగనే నీ నవ్వు మాటలలో
మకరందమున్నదే వింటుంటే సమ్మగున్నదే
గుండె ఉరకలేసినది నాడి జివ్వు నేగిరినది
రక్త ప్రసరణ తేలికై నింగిపైన తేలియాడుతున్నది

ఊహలో నీ రూపు చూసి మురిసితిని...!
నీ సుట్టబుగ్గలో దాగు నవ్వుకి, నీ చెంత నడవగ ఆశ పడితిని
నీ వద్ద కేగి ఓ కౌగిలియని, బుగ్గ కొరికి ఓ ముద్ర వేయని
కోరినాను నీ దరి చేరగా, భూనభోంతరాలు ఉర్రుతలూగగా

ముద్దు మీద మరో ముద్దు సంతకం
హద్దులేని మరు ముద్దు తాపనం
చిరు నవ్వులు రువ్వగ సిరి మువ్వలు పలుకగ
హాయిని గొల్పగ ఈ రేయి, నీ ముద్దు ఔషదం అందియి...!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...