ప్రణయ సుధా నీ కోసమే...!













తొలి చినుకుల తడిసినపుడు
ఉరు మెరుపుల జడిసినపుడు
తడి వలువల జూసినపుడు
తడినేల సుగంధాలు
నీ తనువున వీచినపుడు

పులకించే ధాత్రి దేవిలా
పరవశించి నువు పలికినపుడు
ఇల నింగి కలిసినట్టుగా
వర్షధార పొంగినపుడు

నిన్ను నన్ను దగ్గర చేయ
ప్రేమ వారధిగ మారినపుడు
వరద చేరి నిండు కుండలా
వాగు వంకలిడినపుడు
దయా కరుణ నీ మదిలో చేరి
సహన శీలి గా కాంచినపుడు

జాబిలమ్మను నే తుంచి
నీ నడుము ఒంపులో అది దాచి
వెలుగులు పంచే తారలను
నీ కంఠపు ఆభరణం జేసి
కన్నులమాటు కలగా కరగక
నిజమయ్యే రోజుకొసమే

వసంతముకై కోకిలమ్మలా
నిత్యం నే వేచి చూడనా
అను నిత్యం నిను ఆరాధించనా
నీ ప్రేమే వర్షం అని జాతికంతా చాటిచెప్పనా...!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...