అవనికి ఆకాశం వర్ష ధారల ప్రేమ లేఖ...!








అవనికి ఆకాశం వర్ష ధారల ప్రేమ లేఖ...!

ఆకాశం అలిగినదేమో, మూతి చిన్న బుచ్చిందేమో
కలతప్పి తను నలుపెక్కి, వెక్కి వెక్కి ఏడ్చిందేమో
ఎరుపెక్కిన కన్నుల వెలుగే, మెరుపులాగ మారిందేమో 
వెక్కిల్లే ఉరుముగా మారి పెక్కున అది పెరిగిందేమో

కన్నీరే వర్ష ధారగ, నీ మేను కడిగిందేమో
కన్నెపిల్ల ఒళ్లు తడిపితే భాధ తీరుతుందనో ఏమో
నీ కోసం వెతికిందేమో నీ పైనే రాల్చిందేమో
నీ గుండె గుట్టు తెలియాలంటూ,నీ వెనకే నడిచిందేమో

తన తప్పును ఒప్పమంటు,నీ పాదం కడిగిందేమో
చెప్పు కింద ఉతం ఇచ్చే  భూదేవిని అడిగిందేమో
తడిచిన నీ తనువును చూసి, అబ్బా అని అరిచిందేమో
నీ జత కోసం విల విల లాడి, ప్రేమ ముదిరి పిలిచిందేమో

నువ్వు కాదు అన్నావంటూ, ముందు నిలిచి ఎడ్చిందేమో
నీ ప్రేమ లేని బతుకే చేదని సముద్రాన దూకిందేమో
ఇప్పటికీ నువు ఊ అంటే, ఎగసిన ఆ అల నిను చేరునో ఏమో
ఎత్తుకు నిను నిలుపునో ఏమో, హత్తుకు సెగ తీర్చునో ఏమో...!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

లిపవర్య ప్రేమ లేని బతుకు ఓపలేక అబ్బాయి ఆకాశమై అమ్మాయిని అవనిగా తల్చి రాసిన వర్ష ధారల ప్రేమ లేఖ ఈ నా కవిత...





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...