తొలి ప్రాయపు ఊహల్లో విహాంగాలై ఎగిరాము..!

 


తొలి ప్రాయపు ఊహల్లో విహాంగాలై ఎగిరాము..!

అరె ఇది ఎందిరో, ఆకాశాన తేలినట్టు
నీటిపైన నడిచినట్టు, నేలపైన ఈదినట్టు
జాబిలితో ఊసులాడి, సూర్యునితో ఆటలాడి
చుక్కలన్ని కోసుకొచ్చి, చెలి కోప్పున తురిమినట్టు

వెన్నెలంత తోలుకొచ్చి, సఖి నవ్విన కూర్చినట్టు
పూలవనం సుగంధాలు, పోరి మేను కద్దినట్లు
రామ చిలుక పలుకులన్ని, ముద్దుగుమ్మ నోట ఊరి
కోయిలమ్మ రాగమేదో, కూనలమ్మ గొంతు చేరి

కాలనాగు నడక తీరు, దాని నడుము వంక వారి
కురులు చూడ చిన్నవాయే, హిమము వంటి కోపమాయే
నేను తనకు ప్రాణమాయే, నన్ను విడిచి నిలవదాయే
అయ్యారే ఈ బంధం, తన సౌఖ్యమే నా ఆనందం

తన జతయే నాకిష్టం, దానందమే ఓ మాణిక్యం
మా బంధం చిరకాలం, మా పయణం మరు జన్మం
తను లేనిది నా మరణం, తలరాతకు మేము వెరవం
కలనైనా ఇలనైనా, తనతోడే నా సర్వం....!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...