బ్రతుకే ఉలిపిరి కాగితం..!

 








బ్రతుకే ఉలిపిరి కాగితం..!

ప్రేమ అనే వృక్షానికి, పూసిన ఓ పువ్వువని
మనసు పడి, మదిన చెడి, బ్రమరమునై వెంటపడి
నీ బానిస అయినాను, నీ భావులలో ఒదిగాను

పావురంగ పక్షినై ఇరు రెక్కల దాచాను
పారవశ్యమంత నిండి కన్నుల్లో దాచాను
ప్రీతి కలిగి ప్రాప్తః కాలమంత నిన్ను కాపు కాచాను

ఇష్టం అని మనసిస్తే నిర్లక్ష్యం చూపావు
ఇంక్కొకరికి ఆశ్రయమై హాయిగానే వున్నావు
ఆదరించిన నన్నేమో చిదరించుకున్నావు

దేవతవని పూజిస్తే హారతినే తన్నావు
పువ్వు నాది, పూజ నాది, ఫలం ఆయే పరాయి
కడదాక తోడుంటానని కన్నీళ్ళతో ముంచావు
కనికరం లేకుండా కాటికి నను చేర్చావు

జ్ఞాపకాల కడవలన్ని నేల వొలక బోసావు
తడవ తడవకు గుర్తుకోచ్చి గుండె కోత కోసావు
స్వార్థమే పరమార్థం అను సిద్దాంతం నేర్పావు

శ్రమ స్వేదం నాదయితే వేరుల పంటయినావు
గుండెల్లో తూట్లు పొడిచి తూలనాడి వెళ్ళావు
కన్నీళ్ళ తుఫానులో కడిగేసుకు నడిచావు...!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...