నవ్వుల్లో తంగెల్లు...!

 










నవ్వుల్లో తంగెల్లు...!

సుందరి....!
సిరులు రాలు నీ నవ్వులు
సుధలు జారు నీ మాటలు
సుందర, సుప్రజ, మధుర, సుమధుర
మాటలు లేవే వర్ణణకు అవి చేవులనే తిరిగే, వీణలై మ్రోగే

విశేషమేదో కలిసుందే, వింటుంటే మది పులకించే
జన్మ ధన్యం అనిపించే, మరొక్కసారి అని పిలిచే
మరపున రాక మది తొలిచే, పురివిప్పిన నెమలి గా కాచే
నా ఆలోచనలో హాయిగా కదిలే, పదాల కూర్పుకు బాసటనిచ్చె
నిను పోలిన శిల్పం లేదెడ, నిను పొందిన నేనే గొప్ప ఇలపైన

నేడు నిలో ఉప్పెంగేను ఎన్నో ఆశలు
నను రమ్మని అవి చేసెను సైగలు
నిను వీడి రాగా, తడబడుతూ తిరగబడినవి నడకలు
నీలి మేఘాల వర్ణము, నీ తనువును పోలి మెరిసేను
పూసిన ఆ తంగేడు పువ్వు నీ కొప్పుచేరి మురిసెను
భువి వీడి దివి చేరిన నా దేవిని శ్రీదేవిగా మలిచేను

నిను నను ఒక్కటి చేయు కల ఏదయినా
కలివిడిగా కూడుదాం, ఆలుమగలమై నవ్వుదాం...!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...