దోర సొగసుల జారు పరువం...!

 










దోర సొగసుల జారు పరువం...!

నా ఈ ప్రేమలో ఎన్ని పులకింతలో
చెలియ చిరు నవ్వులో ఎన్ని నెలవంకలో
జారు ఆ పైటలో ఎన్ని కనువింతలో

ఎండలోనే పండువెన్నెల విరగకాసింది
గుండె నిండుగ పండుగలతో కాపు వేసింది
పూత పూసి తిపికాయల విందు పిలిచింది
దోర సొగసుల జారు పరువం జోరు మీదుంది

నాదు ప్రాణం నేలజారి తాళమాడింది, తన పొందు కోరింది
పారు నీరు వంక బారి నడుమునాడింది
ఆ పడచు సొగసు నాదే అనుచు బెరమాడింది
పల్లె పడుచుల నడక నీతో కలిసి సాగింది

కొమ్మలోని కోయిలమ్మె నీ నోట వెలిసింది
నెమలి నాట్యం నడుము తిప్పగ సాయమిచ్చింది
పూల తావులే పాదరక్షలుగ పయణ మయ్యింది
నీ తీరులోనే విజయ నాదం తోడు నిలిచింది

నా ప్రాణమైన పసిడి కూన....!
నా జన్మ పైన ఏడు జన్మల తోడురానుంది
ఈ రాత్రి కనుల కలగా మెరిసి నిదురపుచ్చింది
సరస సౌఖ్య రుచులు జూపి, సరసునిగా నను తీర్చి దిద్దింది
నీ అందమే నా సరస చేరి నీడ లాగా నిలిచి పోయింది....!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...