స్వార్థమనే కీలు లేని సహనమయి మిత్రత్వము

 








స్వార్థమనే కీలు లేని సహనమయి మిత్రత్వము

కుచేలుడు గొని తెచ్చిన అటుకులనే
అమృతమని ఆరగించే యశోద తనయ
సుయోధను స్నేహానికి పొంగిపోయి
తన మన ప్రాణాలనే ధారపోసే కుంతి తనయ

స్వార్థమనే కీలు లేని సహనమయి స్నేహితుడు
చెంత ఉండి మంత్రివలే సూచనలిడు ఆప్తుడు
జీవితపు వైకుంఠపాళి ఆటలో నిచ్చెన ఈ చెలికాడు
ఓటమిలో ఉతమిచ్చు మనుసఖుడీ మిత్రుడు

స్నేహమనే యాగముతో జన సంద్రాన దొరికిన ఓ రక్షకుడు
మన మను సంద్రములో తేలియాడు ముత్యం నా సచివుడు
భాధలనే అలల మునుగువేళ నావికుడీ సంగడీడు
జీవిత గమనాన్ని తీర్చి పేర్చు ప్రేమికుడీ సహాయుడు

కలం పట్టి రాసున్నా తన కీర్తి పొగడ తరుగునా
బలం తాను తోడుంటే జగం నీకు మ్రొక్కదా...!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...