జన్మదిన శుభాకాంక్షలు..!

 








జన్మదిన శుభాకాంక్షలు..!

వేకువ తొలి పొద్దులలో
ప్రసరించిన తొలి కిరణం
వంశాభివృద్ధి చేసే వంశాంకురం
అమ్మ ఆయేషా ఆశా దీపం
నాన్న తాజ్ కలల రూపం

తాతా నానమ్మల గారాబాల
ముద్దుల మనుమడిగా
ఆటల పాటల అల్లరి పిడుగులా
అలరారే అందాల అబ్దుల్ ఆయిష్

ఆచంద్రార్కం......
ఆయురారోగ్యాల తో, అష్టఐశ్వర్యాల తో
నీ భావి జీవితం వికసించి, విరాజిల్లాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఎల్లప్పుడూ సుఖ శాంతులతో
విలసిల్లాలని ఆకాంక్షిస్తూ

హృదయ పూర్వకంగా ఆశీర్వదిస్తూ...
చి|| ఆయిష్ కు జన్మదిన శుభాకాంక్షలు..

సదా నీ క్షేమం కోరే.....
నీకు తెలియని తాతయ్య

ఈ రోజు నా కుమారుని పుట్టిన రోజు సందర్భంగా మా గురువు

 లగిశెట్టి ప్రభాకర్ గారు అందించిన కవితా ఆశీర్వాదం 🙏


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...