అమృత సుతయే ధ్యుమణిగా మారితే...!

 








అమృత సుతయే ధ్యుమణిగా మారితే...!

అమృత సుతయే ధ్యుమణిగా మారి
అపర భామిని ఎరుపు కన్నుల నిప్పు రవ్వలే రాల్చి
కరుణ పంచే కిరణాలన్ని ప్రకోపాలుగా పరిణమించే

ఏడ్చి ఏడ్చి మూర్చ వచ్చిన, ఎదురు కన్నుల కాయ కాచిన
అచేతనమై నేల రాలిన, దప్పికంటూ అరుపుపెట్టిన
దరికి రాదు గోడు వినదు, దయించమన్న గోస కనదు

తోడు లేదు జాడ లేదు, నేటి రోజు తీపి లేదు
బ్రతుకు లేదు భవిత లేదు, నీ నవ్వు లేని రోజు చేదు
అమ్మ కన్నా అంటూ ఉన్నా, నీ పాద మేగి మ్రొక్కుతున్న

నీ నవ్వు మబ్బు కమ్ముకొగ ధ్యుమణి సెగలు ఆరిపోగ
అలక మాను పాన్పు వీడు, చెంత చేరి ఆర్తి తీర్చు
తప్పు కాయి ఒప్పు చేయి, నీ మాట విన్నా అదే హాయి...!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...