విధి విలయములో సంసార రథం...!

 








విధి విలయములో సంసార రథం...!

వరించింది నిజమైతే మన్నించడం తేలిక
సహించడం తెలిస్తే జయించడం తేలిక

నిజాయితీతో నిట్టూరుస్తుంటే
నిజం గ్రహించమని నినదిస్తుంటే
నువ్వే నువ్వే కావాలని రోదిస్తుంటే

నేను కాను నీవు, నీతో కాదు నాకు అంటుంటే
ఇంకెలా ఈ వివాహ విధి వలయం భరించేది
ఎలా ఎలా ఈ క్షణాన్ని నిందించేది నివారించేది

నీకెలా వివరించాలి.....?
నా కన్నీరే ఆవిరై ఆకాశం నలుపెక్కి కురుస్తుందని చెప్పనా
నా రక్తం వరదలై ఈ నేలపైన జాలువారుతుందని చెప్పనా
నా రొదకు చలించి సూర్యుడు దాగున్నాడని చెప్పనా
నా మనసులో చీకటికి ఈ వాతావరణం ఉదాహరణగా చెప్పనా

క్షేమాపణ కు అర్హుడను కానని నివంటుంటే
నీ రూపు చూడలేని దరిదృడనని
కడజాతి సైతం వెలివేసిన పాపాత్ముడనని చెప్పనా
నా బెదురు చూపులు నీ గుండెను పలకరించడం లేదా
నా కన్నీరు నీకు కనికరం నేర్పడం లేదా చెప్పు భామ చెప్పు....!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...