జలవాహం పై తీరిన మోహం...!








జలవాహం పై తీరిన మోహం...!

కురిసే ఈ ప్రతి చినుకు నీ రూపు చూపెడుతూ
పారె ప్రతి చిరు వరద నీ నడుముగా బ్రమపడుతూ
ఉరు మెరుపులు నా కనులై టార్చి వేసి నిను వెతుకుతూ
నల్లని ఆ పొగ మంచు నీ కురులుగా గాలినేగురుతూ

పలికే నా గుండె లయ నీ పేరుగా వినబడుతూ
పచ్చదనం పరుచుకున్న లోగిల్లే నీ కౌగిలవుతూ
కనికట్టు చేసావో, ఆకట్టుకున్నావో...!
గమ్యమయి నీ చుట్టూ గానుగలా తిప్పావో

జాబిలి కరుణించినా భానుడు దయతలచినా
ప్రాణమైన నీ కోసం పరుగుపెట్టి రావాలా
ఈ పొద్దు నీతో పదం కలిపి, నీ గొంతు విని శుభం పలికి
ఈ అనుభూతికి పొంగిపోతూ పాన్పుపైనే తెలాల...!

ఇదో భలే హాయి మరి..!
నేలపైన నిలిచే స్థాయి లేని నాకు ఆకాశం విడిదిస్తానంటే
తారా లోకం తరలి వచ్చి తావునిస్తుంటే
ఆ మెరుపే చెంత చేరి ఇంటి దీపమవుతుంటే
ఆ మేఘమే మా జంట వేడుకకు విడిదవుతుంటే

మనసుకు రెక్కలొచ్చి సాగిన మా సరసోల్లాసం
చాలులే ఈ జన్మకు సాగుదాం పై జన్మకు....!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...